చెవిటికల్లు(కంచికచర్ల): చెవిటికల్లు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ జోరుగా సాగింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా పాల్గొన్నారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించిన ఆమె, వాటిని సంబంధిత అధికారులకు అప్పగిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే “గ్రామంలో ఎక్కడా చెదారం పేరుకుపోకూడదు. శానిటేషన్ పనులు రెగ్యులర్‌గా కొనసాగాలి” అని స్పష్టం చేశారు. త్రాగునీటి సమస్యలపై కూడా అధికారులు సత్వర స్పందన కనబరచాలని సూచిస్తూ… “ప్రతి ఇంటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందేలా వెంటనే చర్యలు తీసుకోండి” అని ఆదేశించారు.
రాత్రి వేళల్లో గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా వీధి దీపాల నిర్వహణపై సౌమ్య ప్రత్యేక దృష్టిసారించారు. చెడిపోయిన దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చేరువై, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం అందించడం తమ లక్ష్యమని సౌమ్య వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామ సమస్యలపై సౌమ్య గారు సీరియస్… అధికారులు వెంటనే యాక్షన్‌కు ఆదేశం
చెవిటికల్లు(కంచికచర్ల): చెవిటికల్లు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ జోరుగా సాగింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా పాల్గొన్నారు. ప్రజలు అందించిన వినతిపత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించిన ఆమె, వాటిని సంబంధిత అధికారులకు అప్పగిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే “గ్రామంలో ఎక్కడా చెదారం పేరుకుపోకూడదు. శానిటేషన్ పనులు రెగ్యులర్‌గా కొనసాగాలి” అని స్పష్టం చేశారు. త్రాగునీటి సమస్యలపై కూడా అధికారులు సత్వర స్పందన కనబరచాలని సూచిస్తూ… “ప్రతి ఇంటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందేలా వెంటనే చర్యలు తీసుకోండి” అని ఆదేశించారు. రాత్రి వేళల్లో గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా వీధి దీపాల నిర్వహణపై సౌమ్య ప్రత్యేక దృష్టిసారించారు. చెడిపోయిన దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చేరువై, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం అందించడం తమ లక్ష్యమని సౌమ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

