గ్రామ పంచాయతీ కార్యదర్శుల రీ–కేటగిరైజేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా సంఘ అధ్యక్షుడు యశ్వంత్ కుమార్ బాయికాటి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు మిస్సైల్ మాన్ డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రీ–కేటగిరైజేషన్ ఫైల్ కేబినెట్ ఆమోదం పొందడం ఎంతో సంతోషకర పరిణామమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శి” అనే పదవిపేరు “పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)”గా మార్చగా, ఇప్పటి వరకు ఉన్న ఐదు గ్రేడ్లను స్పెషల్ గ్రేడ్, 1, 2, 3 గ్రేడ్లుగా పునర్విభజించడం ద్వారా త్వరిత ప్రమోషన్ అవకాశాలు లభించనున్నాయని వివరించారు. దీని వల్ల సంవత్సరాలుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఇది ఎంతో ఆనందదాయకమని అన్నారు.ఈ సంస్కరణల్లో భాగంగా గ్రామ పంచాయతీలలో అదనపు సిబ్బంది నియామకానికి అవకాశం కల్పించడం, అలాగే మినిస్టీరియల్ స్టాఫ్ ప్రమోషన్ ఛానల్‌లో పంచాయతీ కార్యదర్శులను కూడా చేర్చడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని అన్నారు.ఈ నిర్ణయాల అమల్లో పాత్ర వహించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ కమిషనర్, ఓఎస్‌డీ వెంకటకృష్ణకు సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ కుమార్ బాయికాటి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు వేదవతి, రాజశేఖర్, పరమేష్, భాస్కర్, షాహినూర్, ఆరిఫ్, రంగడు శంకర్ నాయక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శుల రీ–కేటగిరైజేషన్‌పై హర్షం వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప