రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపురం సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలో సర్పంచ్ పెంధ్యాల మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎక్కల దేవి పర్శరాములు గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అదేవిధంగా శరీర దారుఢ్యాన్ని పెంచుతాయని యువతలో ఐక్యతను పెంపొందిస్తాయని నేటి యువత అంతర్జాల మాయలో పడి సెల్ ఫోన్లకే అంకితమై తమ సమయాన్ని వృధా చేసుకోకూడదని అతను కోరారు
విజేతలకు బహుమతులు
మొదటి చిగురు శేఖర్ టీమ్
రెండవ బహుమతి బంటు సాగర్ బహుమతులు అందించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు విజయరామారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపేల్లి సురేందర్ రావు, కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మదేవి రెడ్డి, BRS పార్టీ నాయకులు నిమ్మ రాజిరెడ్డి, చారి, చాకలి దేవయ్య గంధం మల్లయ్య యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



