గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సీఎం కప్–2026” క్రీడా పోటీలకు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా అధికారి అజ్మీర రామదాసు గారు, మండల ఎంపీడీవో లచ్చాలు గారు, మండల విద్యాధికారి రాజిరెడ్డి గారు, స్థానిక ఎస్సై గణేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి గారు కలిసి క్రీడా టార్చ్‌ను వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత క్రీడల్లో ముందుకు రావాలని, శారీరక దృఢత్వంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



