గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య రక్షణలో పరిశుభ్రత అత్యంత కీలకమని శ్రీకాళహస్తి ట్రైనింగ్ సెంటర్ రిసోర్స్ పర్సన్ కే. రమేష్‌బాబు అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ‘థీమ్ – 5 పచ్చదనం, పరిశుభ్రత’ పై చిట్వేల్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాసులు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ – ప్రతి గ్రామపంచాయతీ చెత్త రహితంగా, శుభ్రతతో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు బహిరంగ మలవిసర్జన పూర్తిగా మానుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. “స్వాతంత్ర పోరాటం కన్నా సంపూర్ణ పారిశుద్ధ్యం మిన్న” అన్న మహాత్మా గాంధీ మాటలు ప్రతి పంచాయతీ ప్రతినిధి గుర్తుంచుకోవాల్సినవని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్త – పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, వాటిని హరిత రాయబారుల ద్వారా “చెత్త నుంచి సంపద” కేంద్రాలకు తరలించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పచ్చదనం, మొక్కల సంరక్షణ, పారిశుద్ధ్య చర్యలు గ్రామాల ఆరోగ్య పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయని వివరించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని రమేష్‌బాబు పేర్కొన్నారు. అన్ని గ్రామపంచాయతీలు పరిశుభ్రతపై నిరంతరం పని చేయడం ద్వారానే శాశ్వత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నస్రీన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరిధర్, సర్పంచులు ఈశ్వరయ్య, బాలసుబ్రమణ్యం, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామాల పరిశుభ్రత – పచ్చదనంపై దృష్టి పెట్టాలి: ట్రైనర్ రమేష్‌బాబు