Friday, 27 March 2026
  • Home  
  • గ్రామంలో నిల్వ నీటి తొలగింపు
- అన్నమయ్య

గ్రామంలో నిల్వ నీటి తొలగింపు

చిట్వేలి, అక్టోబర్ 31 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర రెడ్డి తక్షణమే స్పందించి, పంచాయతీ కార్యదర్శికి, సిబ్బందికి నిల్వ నీటిని తొలగించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీనితో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, శింగనమల వీధి దర్గా సమీపంలో, చంద్ర డాక్టర్ ఇంటి వద్ద, మసీదు దగ్గర, వై.ఎస్.ఆర్ సర్కిల్ ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పూర్తిగా తొలగించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఉమా మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, నీటి నిల్వలు, చెత్త సమస్యలు వంటి అంశాలపై మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. ప్రజల సహకారం ఉంటే గ్రామ అభివృద్ధి దిశగా మరింత వేగంగా ముందుకు సాగవచ్చు. పంచాయతీ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటాను” అని పేర్కొన్నారు.ఆయన ప్రజలు, పంచాయతీ సిబ్బంది చూపించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

చిట్వేలి, అక్టోబర్ 31 పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర రెడ్డి తక్షణమే స్పందించి, పంచాయతీ కార్యదర్శికి, సిబ్బందికి నిల్వ నీటిని తొలగించాలన్న ఆదేశాలు జారీ చేశారు.
దీనితో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, శింగనమల వీధి దర్గా సమీపంలో, చంద్ర డాక్టర్ ఇంటి వద్ద, మసీదు దగ్గర, వై.ఎస్.ఆర్ సర్కిల్ ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పూర్తిగా తొలగించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఉమా మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ
పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, నీటి నిల్వలు, చెత్త సమస్యలు వంటి అంశాలపై మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. ప్రజల సహకారం ఉంటే గ్రామ అభివృద్ధి దిశగా మరింత వేగంగా ముందుకు సాగవచ్చు. పంచాయతీ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటాను” అని పేర్కొన్నారు.ఆయన ప్రజలు, పంచాయతీ సిబ్బంది చూపించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.