గ్రాండ్ సిటీ లేఔట్‌లో పబ్లిక్ ప్రాపర్టీ కబ్జా – నిద్రలో పాలకులు, ఆందోళనలో ప్రజలు
పొదలకూరు మండలంలోని తోడేరు పంచాయతీ పరిధిలోని గ్రాండ్ సిటీ లేఔట్‌లో రెండు ఎకరాల విలువైన పబ్లిక్ ప్రాపర్టీ స్థలం కబ్జాకు గురవుతోంది. డాబా ఎదురు నెల్లూరు రహదారి వద్ద డోజర్లతో చదును చేయడం సాగుతున్నా, పంచాయతీ పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ లేఔట్లలో ఇలాంటి అక్రమాలు జరిగి, పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని గుర్తు చేస్తున్న ప్రజలు—ఈసారి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అనుమతుల్లేకుండా జరుగుతున్న లేఔట్లపై కూడా విచారణ జరిపాలని కోరుతున్నారు.