తొట్టంబేడులో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భముగా శాఖా గ్రంధాలయం, తొట్టంబేడు నందు గ్రంథాలయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వము, చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి .సురేంద్రనాథ్ చేతులమీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా మెడల్స్, జాతీయ ప్రముఖుల గురించిన పుస్తకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు జ్ఞాన సముపార్జనకు నిలయాలని ఒక మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో సమానమని నేటి యువత గ్రంథాలయాలను చక్కగా వినియోగించుకొని ఉన్నత శిఖరాలు కు చేరుకోవాలన్నారు. అనంతం గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ.. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలకి గ్రంథాలయ సభ్యత్వము తీసుకుని బాల్య దశ నుంచే గ్రంథాలయాలు సందర్శించే విధముగా ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో గర్ల్స్ హాస్టల్ వెల్ఫెర్ ఆఫీసర్ యం.జయసుధ, రీడర్స్ క్లబ్ సభ్యులు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవాల్లో విజేతలకు బహుమతుల ప్రధానం