Sunday, 7 December 2025
  • Home  
  • గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి
- రంగారెడ్డి

గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

పున్నమి అక్టోబర్ 24 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: ఘట్కేసర్ పరిధిలోని పోచారం పోలీస్‌స్టేషన్ సమీపంలో గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజీపీ కార్యాలయాన్ని గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముట్టడించడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి, ముట్టడిని అడ్డుకోవడంతో కార్పొరేటర్ గారితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గోమాత రక్షణ కోసం కృషి చేస్తున్న ప్రశాంత్‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై కాకుండా ఆ విలువలపై దాడి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. అదేవిధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పున్నమి అక్టోబర్ 24 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: ఘట్కేసర్ పరిధిలోని పోచారం పోలీస్‌స్టేషన్ సమీపంలో గోరక్షకుడు ప్రశాంత్‌పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజీపీ కార్యాలయాన్ని గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముట్టడించడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి, ముట్టడిని అడ్డుకోవడంతో కార్పొరేటర్ గారితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..
గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గోమాత రక్షణ కోసం కృషి చేస్తున్న ప్రశాంత్‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై కాకుండా ఆ విలువలపై దాడి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. అదేవిధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.