📝 గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల – “యువతకు సందేశం” కరపత్రం ఆవిష్కరణ
ఈ రోజు గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో “యువతకు సందేశం” అనే కరపత్రం ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే. బుచ్చయ్య గారు మరియు కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి విలువైన సందేశాలు అందించారు.
వారు మాట్లాడుతూ—
“దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. కాపీలు కొట్టే అలవాటు మన భవిష్యత్తును మాత్రమే కాదు, కుటుంబ, సమాజ, దేశ ప్రగతిని కూడా అడ్డుకుంటుంది.” అని విద్యార్థులను హెచ్చరించారు.
అలాగే కళాశాలలో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను వివరించారు:
ప్రతి తరగతి గదిలో A/C సదుపాయం
డిజిటల్ బోర్డులు
త్వరలో పీజీ కోర్సుల కోసం కొత్త భవనం నిర్మాణం
ఉన్నత విద్యావేత్తలు, పిహెచ్.డి చేసిన లెక్చరర్ల సేవలు
ఈ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు రెగ్యులర్ గా క్లాసులకు హాజరై, శ్రద్ధతో చదివి తమ జీవిత వికాసాన్ని సాధించాలి అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నిర్మల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదాకర్ గారు, డా. రవీకుమార్, డా. రఘునాథ్, డా పవన్ సార్, రాజు సార్ డాక్టర్ ఓం ప్రకాష్ సార్ కిషన్ సార్ రాజయ్య సార్ రామ్మోహన్ సురేందర్ అబ్దుల్లా మజా ఇఫ్రాన్ వాయిదా సంజీవ్ సార్ రాజు సార్ తదితర లెక్చర్స్ మరియు సి పి డి సి కార్యదర్శి మనోజ్, కళాశాల డైరెక్టర్ నిఖిల్ చెందర్, అనేకమంది తల్లిదండ్రులు మరియు దాదాపు 556 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


