నేడు గోపాల్‌రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సీపీడీసీ కమిటీ సందర్శించింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బుచ్చయ్య గారు, కళాశాల అధ్యక్షులు డా. నాగేశ్ గారు, సభ్యులు మనోజ్ గారు, మోసీన్ ఖాన్ గారు, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ గారు, డా. భీమ్రావ్ గారు, డా. గంగారెడ్డి గారు తదితర లెక్చరర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కళాశాల అధ్యక్షులు డా. నాగేశ్ గారు మరియు ప్రిన్సిపాల్ బుచ్చయ్య గారు మాట్లాడుతూ —
ప్రస్తుతం ప్రభుత్వం కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు ₹90 లక్షల విలువైన ఫర్నీచర్ ను అందజేసిందని తెలిపారు. అదేవిధంగా ₹30 లక్షల విలువైన డిజిటల్ బోర్డులు ప్రతి తరగతిలో ఏర్పాటు చేయడం విశేషమని అన్నారు.
మన కళాశాలలో ఐఐటీ స్థాయిలో విద్యార్థులకు అందే సదుపాయాలన్నీ ఏర్పాటు చేయబడినట్లు పేర్కొన్నారు. అత్యంత అర్హత కలిగిన Ph.D. లెక్చరర్లు విద్యార్థులకు బోధన అందిస్తున్నారని, త్వరలోనే పీజీ కోర్సులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అధ్యక్షులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ –
“విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరై, క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకుని మంచి అభివృద్ధి సాధించాలి. రాబోయే తరానికి మీరు ప్రేరణగా నిలవాలి. మీ భవిష్యత్తు మా ఆశయమూ, అభిలాషయూ,” అని అన్నారు.
చివరిగా సీపీడీసీ కమిటీ సభ్యులు కళాశాల అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు

