రెండు తండాల ఐక్యతతో అభివృద్ధి పోరు!
కామారెడ్డి, 14 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గోకుల్ తండా గ్రామంలో స్థానిక సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఘన విజయం! కేతావత్ మోహన్ సర్పం చ్ గా గెలిచి, గ్రామ ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం చేసుకున్నారు. ఎన్నికల తీర్థం ముగిసిన వెంటనే రెండు తండాల గ్రామస్తులు కలిసి ఆయన ను, పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. “కలిసి అభివృద్ధి.. కలిసి సాగుదాం!” అనే నినాదంతో గ్రామం మొత్తం ఉల్లాసంగా ముందుకు సాగనుంది!గ్రామ పెద్దల ఐక్యత.. మోహన్ విజయం సాధించా రు. గూగుల్‌తండా గ్రామంలో రెండు తండాల కలయికే మాలవత్ మోహన్ విజయ రహస్యం! ఎన్నికల పోరాటంలో గ్రామస్తులు ఒక్కటిగా నిలబడి, అభివృద్ధి కోసం మోహన్‌ను చేతిలో ఆయుధంగా చేశారు. సర్పంచ్‌గా గెలిచిన అనంత రం గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి సన్మాన సమ్మేళనం నిర్వహించారు. “మా గ్రామం రెండు తండాలు కలిసి ఒక్కటే.. మోహన్ నాయక త్వంలో అభివృద్ధి రంగులు చూస్తాం!” అంటూ ఘనంగా స్వాగతించారు. ఈ ఐక్యతే గ్రామ భవిష్య త్తుకు బలమైన పునాది అవుతుందని గ్రామ పెద్ద లు స్పష్టం చేశారు.”కలిసి సాగుదాం” నినాదం.. గ్రామ అభివృద్ధికి కొత్త దిశ!సన్మాన సమ్మేళనంలో మాట్లాడిన గ్రామ పెద్దలు, “రెండు ఖండాల కలయి కతోనే మా గోకుల్ తండా ముందు కు సాగాలి. మోహన్ సర్పంచ్ నాయకత్వంలో రోడ్లు, నీరు, విద్యుత్, ఆరోగ్యం.. అన్ని అభివృద్ధి పనులు వేగం గా పూర్తవుతాయి” అని ప్రకటించారు. “కలిసి అభివృద్ధి చేసుకుందాం..కలిసి సాగుదాం!” అనే నినాదంతో గ్రామస్తులు ఉల్లాసపడ్డారు.ఈ ఘన సన్మానం గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని, ఐక్యతను నింపింది. మోహన్ సర్పంచ్ స్పందిస్తూ, “గ్రామ ప్రజల నమ్మకంతో అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తాను” అని హామీ ఇచ్చారు.ఈ సంఘటన తెలం గాణ గ్రామీణ ఎన్నికల్లో ఐక్యత శక్తిని మరోసారి నిరూపించింది.


