రైతులకు యూరియా బుకింగ్ ఆన్‌లైన్ సహాయం!
కామారెడ్డి, 06 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో అంటున్నా సర్పంచ్ కిషన్ యాదవ్ సంకల్పంతో మంగళవారం గొల్లపల్లి ప్రథమిక పాఠశాలలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. స్థానిక పాలకులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు కలిసి పిల్లల మధ్యాహ్నాహారాన్ని పరిశీలించి,వారితో పాటు తిన్నారు. అంతేకాకుం డా, రైతులకు యూరియా ఆన్‌లైన్ బుకింగ్‌లో సహాయం చేసి, వ్యవసాయ ఎరువుల వివరాలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, రైతుల పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది.మధ్యాహ్నం పాఠ శాలలో జరిగిన ఈ పరిశీలన సర్పంచ్ కిషన్ యాద వ్ నేతృత్వంలో జరిగింది. ఉపసర్పంచ్ మధుసూ దన్, 5వ వార్డు సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, 6వ వార్డు మల్లేష్, రాజేశ్వర్, గొల్ల నవీన్‌లతో పాటు హెచ్ఎం రాజు కుమార్ కలిసి పిల్లల మధ్యాహ్నాహారం త యారీ నుంచి పంపిణీ వరకు పరిశీలించారు.ఫుడ్ ఎలా పెడుతున్నారు? పిల్లలకు రుచి, పోషకాలు సరిపోతున్నాయా?అని వారు అడిగి తెలుసుకు న్నారు. తర్వాత, పిల్లలతో కలిసి మధ్యాహ్నాహారం తిని, వారి సంతోషాన్ని పంచుకున్నారు.పిల్లల మధ్యాహ్నాహారం పరిశీలనకు ప్రత్యేకంగా గ్రామ పాలకులు రాణించారు.పిల్లల ఆరోగ్యం, చదువు మా మొదటి ప్రాధాన్యత.ఈ పద్ధతి గ్రామంలో అమలు చేస్తూ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామని సర్పంచ్ కిషన్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు సంతోషంగా పాల కులను కొనియాడారు.


