కేతేపల్లి : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఉన్న పశువైద్యశాలలో గొర్రెలకు, మేకలకు వేసే నట్టల మందులు గత 2 సంవత్సరాల నుండి మందులు రావడంలేదని, ఎన్నిసార్లు అధికారులకు తెలిపిన పంపడం లేదని, అదే విధంగా గ్రామంలోని గోర్లు, మేకలు పెంచే ప్రతి ఒక్కరు గోర్లు, మేకలకి వాక్సిన్ తప్పకుండ వేయించుకొని, వాటిని కాపాడుకోవాలని లైఫ్ స్టాక్ అసిస్టెంట్ సుంకబోయిన సైదమ్మ గారు తెలిపారు.
ఆగస్ట్ నెలలో కురిసిన వర్షాలకు పశువైద్యశాలలో నీరు నిలువడం మరియు భవనం చుట్టూ ఉన్న గోడలు కూలె స్థితిలో ఉన్నవి కావున వాటిని కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.


