పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో భూస మల్లేష్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోట అగన్న. హాజరై గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి , ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు , చికోడు గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూస మల్లేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

