Friday, 6 February 2026
  • Home  
  • గూడెం కొత్తవీధికి అభివృద్ధి బాట, ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం మండల పరిషత్ నిధులతో జీకే వీధిలో పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం.
- అల్లూరి సీతారామరాజు

గూడెం కొత్తవీధికి అభివృద్ధి బాట, ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం మండల పరిషత్ నిధులతో జీకే వీధిలో పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం.

జి. కె. వీధి పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 07: గూడెం కొత్తవీధి: గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ప్రజల చిరకాల కోరిక అయిన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మండల పరిషత్ (ఎంపీ) నిధులను వినియోగిస్తూ, పోలీస్ స్టేషన్ గేటు నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు ఈ రోడ్డు పనులను ఎంపీటీసీ రీమల రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కుమారి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ రీమల రాజేశ్వరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా, మండల పరిషత్ నిధులతో రాబోయే కాలంలో గ్రామాభివృద్ధికి దోహదపడే మరిన్ని ముఖ్యమైన పనులు చేపట్టనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.ఈ ప్రారంభోత్సవంలో జనసేన ఎగ్జిక్యూటివ్ నెంబర్ గోర్లే వీర వెంకట్, స్థానిక ప్రెసిడెంట్ కోర్ర సుభద్ర, ఇతర ఎంపీటీసీలు నాగమణి, రాజులమ్మ, టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముక్కలీ రమేష్, టిఎన్ఎస్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి, టిడిపి మాజీ జెడ్పిటిసి గంట నలిని, జనసేన నాయకులు సుర కత్తి నాగేష్, గబులంగి శివ, వైసీపీ నాయకుడు వంతల అరుణ్, బిజెపి నాయకుడు రిమల పాల్, గడుతూరి పరమేష్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జి. కె. వీధి పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 07:

గూడెం కొత్తవీధి: గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ప్రజల చిరకాల కోరిక అయిన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మండల పరిషత్ (ఎంపీ) నిధులను వినియోగిస్తూ, పోలీస్ స్టేషన్ గేటు నుంచి ఎంపీయూపీ పాఠశాల వరకు ఈ రోడ్డు పనులను ఎంపీటీసీ రీమల రాజేశ్వరి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కుమారి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ రీమల రాజేశ్వరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులకు వేగంగా నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా, మండల పరిషత్ నిధులతో రాబోయే కాలంలో గ్రామాభివృద్ధికి దోహదపడే మరిన్ని ముఖ్యమైన పనులు చేపట్టనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.ఈ ప్రారంభోత్సవంలో జనసేన ఎగ్జిక్యూటివ్ నెంబర్ గోర్లే వీర వెంకట్, స్థానిక ప్రెసిడెంట్ కోర్ర సుభద్ర, ఇతర ఎంపీటీసీలు నాగమణి, రాజులమ్మ, టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముక్కలీ రమేష్, టిఎన్ఎస్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి, టిడిపి మాజీ జెడ్పిటిసి గంట నలిని, జనసేన నాయకులు సుర కత్తి నాగేష్, గబులంగి శివ, వైసీపీ నాయకుడు వంతల అరుణ్, బిజెపి నాయకుడు రిమల పాల్, గడుతూరి పరమేష్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.