Sunday, 7 December 2025
  • Home  
  • గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ కృషి అభినందనీయం… – టిడిపి సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ కృషి అభినందనీయం… – టిడిపి సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంతర్జాతీయ గూగుల్ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయటానికి మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి అన్నారు.యువతకు ఇది ఎంతో ప్రయోజనకరమని వారి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుందనీ.. సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారని తెలియజేశారు. గూగుల్ క్లౌడ్ సంస్థ మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం శుభ పరిణామం అని అన్నారు.ప్రపంచంలో అమెరికా తర్వాత దేశంలోనే అతిపెద్ద తొలి ఏఐ హబ్ గూగుల్ క్లౌడ్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయబోతుందన్నారు. ఈ సబ్ సి కేబుల్ నెట్ వర్క్ ను అంతర్జాతీయ నెట్ వర్క్ కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత సంస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుందని అన్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. ఈ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ చర్చ్, సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచి ప్రపంచానికి అందించబడునున్నాయన్నారు.గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీసుకుని రావడంతో ఏ విధంగా అభివృద్ధిలో కారకంగా నిలిచిందో అదే విధంగా గూగుల్ సంస్థ కూడా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు..భవిష్యత్తును ముందే గ్రహించి ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ భవిష్యత్ తరాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి తెలియజేశారు.

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంతర్జాతీయ గూగుల్ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయటానికి మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి అన్నారు.యువతకు ఇది ఎంతో ప్రయోజనకరమని వారి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుందనీ..
సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు.
యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారని తెలియజేశారు. గూగుల్ క్లౌడ్ సంస్థ మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం శుభ పరిణామం అని అన్నారు.ప్రపంచంలో అమెరికా తర్వాత దేశంలోనే అతిపెద్ద తొలి ఏఐ హబ్ గూగుల్ క్లౌడ్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయబోతుందన్నారు. ఈ సబ్ సి కేబుల్ నెట్ వర్క్ ను అంతర్జాతీయ నెట్ వర్క్ కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత సంస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుందని అన్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. ఈ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ చర్చ్, సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచి ప్రపంచానికి అందించబడునున్నాయన్నారు.గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీసుకుని రావడంతో ఏ విధంగా అభివృద్ధిలో కారకంగా నిలిచిందో అదే విధంగా గూగుల్ సంస్థ కూడా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు..భవిష్యత్తును ముందే గ్రహించి ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ భవిష్యత్ తరాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.