కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్:
గూగుల్ డేటా సెంటర్ రాకతో యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం జరుగుతుందని, సాంకేతిక రంగం రాష్ట్ర భవిష్యత్తును ఏరకంగా మారుస్తుందో హైదరాబాద్ ఉదాహరణ అని, ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాదును ఐటీ హబ్ గా మార్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు దూర దృష్టితో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని, నేడు చంద్రబాబు సారధ్యంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్ర రాష్ట్రం డిజిటల్ హబ్ గా మారుతుందని, నేడు గూగుల్ సంస్థ విశాఖలో 87 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రెండవ డేటా క్లస్టర్ ను ఏర్పాటు చేయబోతుందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా మారుతుందని, సింగపూర్, అమెరికా, మలేషియా, వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలను తీసుకురావడం జరుగుతుందని, గూగుల్ రాకతో రానున్న కాలంలో ఐటీ, టెక్, ఏ ఐ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు రాకతో ఆంధ్ర రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయి అని, నేడు గూగుల్ సంస్థ రాకతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపతం కావడంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు మెరుగుపడతాయని, గత వైసిపి ప్రభుత్వం ఎటువంటి ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేయలేదని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తగిలిపోయే విధంగా పాలన సాగించారని పేర్కొన్నారు.

గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర సర్వతోమకాభివృద్ధి* *శాసనసభ్యులు వనమాడి కొండబాబు*
కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: గూగుల్ డేటా సెంటర్ రాకతో యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం జరుగుతుందని, సాంకేతిక రంగం రాష్ట్ర భవిష్యత్తును ఏరకంగా మారుస్తుందో హైదరాబాద్ ఉదాహరణ అని, ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాదును ఐటీ హబ్ గా మార్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు దూర దృష్టితో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని, నేడు చంద్రబాబు సారధ్యంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్ర రాష్ట్రం డిజిటల్ హబ్ గా మారుతుందని, నేడు గూగుల్ సంస్థ విశాఖలో 87 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రెండవ డేటా క్లస్టర్ ను ఏర్పాటు చేయబోతుందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా మారుతుందని, సింగపూర్, అమెరికా, మలేషియా, వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలను తీసుకురావడం జరుగుతుందని, గూగుల్ రాకతో రానున్న కాలంలో ఐటీ, టెక్, ఏ ఐ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు రాకతో ఆంధ్ర రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయి అని, నేడు గూగుల్ సంస్థ రాకతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపతం కావడంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు మెరుగుపడతాయని, గత వైసిపి ప్రభుత్వం ఎటువంటి ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేయలేదని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తగిలిపోయే విధంగా పాలన సాగించారని పేర్కొన్నారు.

