రామాపురం మండలంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుండి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, హైదరాబాదు నుండి అరుణాచలం వైపు వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
శివాలయం దగ్గర రెండో మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయే క్రమంలో ఆర్టీసీ బస్సు షిఫ్ట్ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రామాపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనం ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రామాపురం ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు – షిఫ్ట్ కారు ఢీ
రామాపురం మండలంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుండి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, హైదరాబాదు నుండి అరుణాచలం వైపు వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. శివాలయం దగ్గర రెండో మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయే క్రమంలో ఆర్టీసీ బస్సు షిఫ్ట్ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రామాపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనం ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రామాపురం ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

