గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభంపై రైతుల హర్షం.
నందవరం ఎమ్మిగనూరు మండలంలోని గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు స్కీముల పనులకు టెండర్ ప్రక్రియ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియపై రైతులు, వైఎస్సార్సీపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం అధికారుల హామీకి అనుగుణంగా చర్యలు చేపట్టడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో గడ్డం నారాయణరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.

