Friday, 6 February 2026
  • Home  
  • గురువే ప్రత్యక్ష దైవం : లయన్ డా. పైడి సింధూర
- ఆంధ్రప్రదేశ్

గురువే ప్రత్యక్ష దైవం : లయన్ డా. పైడి సింధూర

శ్రీకాకుళం: గురువుల స్థానం ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్మరణీయమని, వారిని ప్రత్యక్ష దైవాలుగా భావించాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా. పైడి సింధూర అన్నారు.స్థానిక డే అండ్ నైట్ కూడలిలోని ప్రైవేట్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువులకు పాదాభివందనం చేసి, లయన్ ఇంటర్నేషనల్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, దుస్తులువాలతో సత్కరించారు.డా. సింధూర మాట్లాడుతూ – “కనిపించే దైవాలు తల్లిదండ్రులు. కానీ విద్యా బోధన చేసి, క్రమశిక్షణతో విలువలతో కూడిన జీవితాన్ని కల్పించి, సమాజంలో సుస్థిర స్థానం కల్పించిన ఘనత గురువులదే. అందువల్ల గురువులను ప్రత్యక్ష దైవాలుగా భావించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంటార్ నటుకుల మోహన్, జిల్లా లయన్స్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, సీనియర్ సభ్యులు బాడాన దేవభూషణం, ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి తదితరులు మాట్లాడి గురువుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, వారిని గౌరవించడం ప్రతీ ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.సత్కరించిన వారిలో పారశెల్లి తిరుపతిరావు, డా. బోగెల ఉమామహేశ్వరరావు, బెందాళం వరలక్ష్మి, కిల్లి అప్పారావు, డా. ఎంకే మిశ్రో, కె. జగదీశ్, ఎన్. రమ్య, డబ్బీరు సంధ్యరాణి తదితరులు ఉన్నారు.ఈ వేడుకలలో సెక్రటరీ టెక్కం రాంగోపాల్, కోశాధికారి బి. కృష్ణ చైతన్య, డా. ఎం. మురళీకృష్ణ, బి. శ్రావ్య, నారా ఈశ్వరరావు, జి. చిన్నారావు, బి. మాధురి, అనిల్ పొడుగు, చరణ్, రామం, వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.