గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల పదవీవిరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రుల ఉపసంఘం సిఫారసు చేయడం పట్ల నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖను అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే దీనికి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాటకం తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యతో పాటు ఎం. సుబ్బారావు, ఎస్. బంగారయ్య పాల్గొన్నారు.

గురుకుల ఉపాధ్యాయుల పదవీవిరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల పదవీవిరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రుల ఉపసంఘం సిఫారసు చేయడం పట్ల నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖను అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే దీనికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాటకం తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యతో పాటు ఎం. సుబ్బారావు, ఎస్. బంగారయ్య పాల్గొన్నారు.

