గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు మండలం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 15 రోజుల నుండి ఈరోజు వరకు గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతీ రోజూ సాయంత్రం అయ్యప్పభక్తులకు మరియు విచ్చేసిన భక్తులకు భిక్ష(200 నుండి 250 మందికి) ఏర్పాటు చేసి చివరిగా పడి పూజ ఏర్పాటు చేసి (సుమారు రెండు లక్షల రూపాయలు వరకు సొంత నిధులతో) దిగ్విజయంగా జరిపించినందులకు గానూ శ్రీ చీతిరాల రామానుజం రంగనాయకమ్మ ట్రస్ట్ కార్య నిర్వహణ అద్యక్షులు మోపూరు వెంకటసుబ్బయ్య మరియు కార్యదర్శులు గణేష్,సత్యనారాయణకు చిరు సత్కారం చేయడం జరిగింది.


