Sunday, 7 December 2025
  • Home  
  • గుడ్డ(జూట్) సంచులను వినియోగించండి
- ఆంధ్రప్రదేశ్

గుడ్డ(జూట్) సంచులను వినియోగించండి

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో పర్యావరణ పరిరక్షణ కొరకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం పురపాలక ఆరోగ్యాధికారి సుధీర్ మాట్లాడుతూ…కేంద్ర మంత్రి, రాష్ట్రమంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్, శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యత మనందరిదని, వీలైనంతవరకు గుడ్డ (జూట్) సంచులను వినియోగించాలని అవగాహన కల్పించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డా.డోల అప్పన్న మరియు సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమానికి పర్యావరణ పరిరక్షణలో బాగమవ్వటం హర్షణీయమన్నారు. ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె (జూట్‌) సంచుల వాడకం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి నాందని, మార్పు మనతోనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డా. డోల అప్పన్న మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులతో పర్యావరణ కాలుష్యం వాటిల్లటమే కాకుండా, కాన్సర్ తోపాటు అనేక రోగాలకు కారకులవుతామన్నారు. అలాగే ఒక్క సారి వాడి, బయటకు పారవేసే వాటిని వాడకూడదని, వాటిని రహదారులపై పారవేయకుండా రహదారికి ఇరువైపులా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్తకుండీలో వేసి, పర్యావరణ పరిరక్షణతోపాటు, మున్సిపల్ దిగువస్థాయి ఉద్యోగులకు సహకరించిన వారవుతారని, సుందర శ్రీకాకుళంలో మనమంతా భాగమవ్వాలన్నారు. ఇందులో భాగముగా శ్రీ సంతోషిమాతా లోన్ కన్సల్టేన్సీ అధినేత జామి.శ్రీనివాస్ బృందం పాల్గొని, ప్లాస్టిక్ పై చేసిన నినాదాలు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర, ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి.లావణ్య అందించిన గుడ్డ సంచులను పాత బస్ స్టాండ్ కూడలి, పెద్ద మార్కెట్, ఏడు రోడ్ల కూడలితోపాటు, పలు ముఖ్య కూడలిలో పాదచారులకు, వ్యాపారవర్తకులకు సంచులను అందించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డోల శంకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా. ప్రవీణ్ కుమార్.తిత్తి, పి.హేమ సుందర్, బి.రాజేష్, ఆకుల.మాధవ్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబాల. మోహన్, కార్తీక్, లీలాకృష్ణ, బొడ్డ కృష్ణ, కృష్ణ, సామాజిక ససేవకులు, ఫ్రీలన్సర్ ఉర్లం. శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

  • పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
  • పురపాలక ఆరోగ్యాధికారి సుదీర్
  • ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం.(శ్రీకాకుళం టౌన్ – అక్టోబర్ పున్నమి ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో పర్యావరణ పరిరక్షణ కొరకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం పురపాలక ఆరోగ్యాధికారి సుధీర్ మాట్లాడుతూ…కేంద్ర మంత్రి, రాష్ట్రమంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్, శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యత మనందరిదని, వీలైనంతవరకు గుడ్డ (జూట్) సంచులను వినియోగించాలని అవగాహన కల్పించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డా.డోల అప్పన్న మరియు సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమానికి పర్యావరణ పరిరక్షణలో బాగమవ్వటం హర్షణీయమన్నారు.

ప్లాస్టిక్‌ సంచులకు ప్రత్యామ్నాయంగా గోనె (జూట్‌) సంచుల వాడకం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, ప్రభుత్వాల పాత్ర కన్నా ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ఇంటి నుంచి బయలుదేరే ముందే గోనె సంచి పట్టుకోవడం రానున్న ఆరోగ్యకర సమాజానికి నాందని, మార్పు మనతోనే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డా. డోల అప్పన్న మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులతో పర్యావరణ కాలుష్యం వాటిల్లటమే కాకుండా, కాన్సర్ తోపాటు అనేక రోగాలకు కారకులవుతామన్నారు. అలాగే ఒక్క సారి వాడి, బయటకు పారవేసే వాటిని వాడకూడదని, వాటిని రహదారులపై పారవేయకుండా రహదారికి ఇరువైపులా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్తకుండీలో వేసి, పర్యావరణ పరిరక్షణతోపాటు, మున్సిపల్ దిగువస్థాయి ఉద్యోగులకు సహకరించిన వారవుతారని, సుందర శ్రీకాకుళంలో మనమంతా భాగమవ్వాలన్నారు.

ఇందులో భాగముగా శ్రీ సంతోషిమాతా లోన్ కన్సల్టేన్సీ అధినేత జామి.శ్రీనివాస్ బృందం పాల్గొని, ప్లాస్టిక్ పై చేసిన నినాదాలు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర, ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి.లావణ్య అందించిన గుడ్డ సంచులను పాత బస్ స్టాండ్ కూడలి, పెద్ద మార్కెట్, ఏడు రోడ్ల కూడలితోపాటు, పలు ముఖ్య కూడలిలో పాదచారులకు, వ్యాపారవర్తకులకు సంచులను అందించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డోల శంకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డా. ప్రవీణ్ కుమార్.తిత్తి, పి.హేమ సుందర్, బి.రాజేష్, ఆకుల.మాధవ్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబాల. మోహన్, కార్తీక్, లీలాకృష్ణ, బొడ్డ కృష్ణ, కృష్ణ, సామాజిక ససేవకులు, ఫ్రీలన్సర్ ఉర్లం. శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.