అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 1 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. గుడ్డు ఒలిచి అన్నంలో కలిపి స్వయంగా పిల్లలకు అందించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని, చదువు-సౌకర్యాలపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. మంత్రితో కలిసి భోజనం చేసినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు



