అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అర్ధరాత్రి ఒక్క సరిగా డీసీఎం దూసుకెళ్ళింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్ దగ్గర నివసిస్తున్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గుడిసెలోకి దూసుకెళ్లిన డిసిఎం – తప్పిన పెను ప్రమాదం
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అర్ధరాత్రి ఒక్క సరిగా డీసీఎం దూసుకెళ్ళింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. కడప జిల్లా ఒంటిమిట్ట నుండి హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్ దగ్గర నివసిస్తున్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

