గుడిలోవ హైవేపై లారీ బోల్తా
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖ ఆనందపురం మండలం గుడిలోవ హైవేపై అల్లం లోడుతో వెళ్తున్న లారీ బెంగళూరు నుంచి కలకత్తా వెళ్తున్న క్రమంలో గురువారం ఉదయం పెందుర్తి వైపు నుంచి అనందపురం వెళ్తున్న గుడిలోవ వద్ద వచ్చేసరికి అదుపుతప్పి హైవేలో లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


