కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చేయరు నదీ తీరాన వెలసిన శ్రీ అన్నపూర్ణా సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 03-01-2026, శనివారం నాడు శివ ముక్కోటి (పుష్య శుద్ధ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీ చాపాటి శివయ్య స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమ వివరాలు:
ఉదయం 7:00 గంటలకు: మహాగణపతి పూజ, స్వస్తి వాచనము, మహాన్యాస పారాయణము, ప్రధాన దేవతా కలశస్థాపనలు. అనంతరం మహాగణపతి, రుద్ర, చండీ, ప్రత్యంగిరా హోమములు నిర్వహించబడతాయి.
మధ్యాహ్నం 12:00 గంటలకు:
విశేష ‘మహాపూర్ణాహుతి’ కార్యక్రమం జరుగును.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో, 16 మంది రుత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
ఉభయదారులుగా చేరదలచిన భక్తులు రూ. 1516/- చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు:
శ్రీ చాపాటి శివయ్య స్వామి: 9491222551
బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ: 9866809476
బ్రహ్మశ్రీ బనగానపల్లె సంతోష్ కృష్ణ శర్మ: 9701607510


