కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండాలకోనలో భక్తి జలధి అలముకుంది. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
మహిళలు దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంతో పాల్గొనగా, ఆలయ ప్రాంగణం వెలుగుల తారకలతో మెరిసిపోయింది. మండల పరిధిలోని పలు శివాలయాల్లో కూడా శివపార్వతులకు విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చిట్వేల్ శివాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గుండాలకోన పరిసర ప్రాంతాలన్నీ భక్తి తరంగాలతో నిండిపోయాయి.


