
నరసన్నపేట మండలం, జూలై 29:మండలంలోని గుండివిల్లిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార నాణ్యతను సుదీర్ఘంగా పరిశీలించిన ఆయన, పిల్లలకు పోషకాహారంతో కూడిన, శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.

