గుంటూరు పశ్చిమ నియోజకవర్గం:
మహిళల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “మహిళా గ్రీవెన్స్ డే” ప్రారంభించబడింది.
ఈ కార్యక్రమం మహిళల శ్రేయస్సు కోసం, వారి విన్నపాలకు స్పందించే వేదికగా నిలవనుంది.
మహిళల భాగస్వామ్యంతో చురుకైన కార్యక్రమం
23వ డివిజన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలురకాల మహిళా సమస్యలపై చర్చ జరిగింది. స్థానిక మహిళలు తమ అభ్యంతరాలు, విన్నపాలను “రెడ్ బుక్”లో నమోదు చేసి,
మా లేడీ లెజెండ్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారిని వ్యక్తిగతంగా కలసి వివరించారు.
ముఖ్య అంశాలు
1️⃣ అంగన్వాడీ సెంటర్ల పరిస్థితులు:
గళ్ళా మాధవి గారు స్వయంగా పలు అంగన్వాడీ సెంటర్లను సందర్శించి, పిల్లల పోషణా సేవలు, సదుపాయాలపై సమీక్ష జరిపారు.
2️⃣ పరిశరాల పరిశుభ్రత:
మహిళలు తమ ప్రాంతాల్లో పరిశుభ్రత లోపాలను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
3️⃣ ప్రజల్లో అవగాహన కార్యక్రమం:
23/09/2025 నుంచి 13/10/2025 వరకు ఇంటింటికీ, షాపులకు వెళ్లి GST పై అవగాహన కల్పించిన వర్క్ గురించి ఎమ్మెల్యే గారికి వివరించబడింది. గళ్ళా మాధవి గారు ఈ చర్యను అభినందిస్తూ మహిళల సామాజిక చైతన్యాన్ని ప్రశంసించారు.
మహిళా నాయకురాళ్ల పాల్గొనిక
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
అంగన్వాడీ, డ్వొక్ర సాధికారిక సంస్థ ప్రతినిధులు,
గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి లాం ✌️,
164వ బూత్ ఇన్‌చార్జ్ నవమి లాం ✌️ పాల్గొని కార్యక్రమాన్ని మరింత బలపరిచారు.
గళ్ళా మాధవి గారి మాటల్లో…
“మహిళల సమస్యలు పరిష్కరించడమే మా మొదటి ప్రాధాన్యత. మహిళలు నిస్సంకోచంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలి. ప్రభుత్వం ప్రతి స్థాయిలో మీకు అండగా ఉంటుంది,” అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.


