📰 భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం
విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని
INDIAN KNOWLEDGE SYSTEM వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ప్రారంభమైంది. శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు.


