Thursday, 5 February 2026
  • Home  
  • గీతం వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ ఉత్సవం
- ఆంధ్రప్రదేశ్

గీతం వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ ఉత్సవం

విశాఖపట్నం , అక్టోబర్ వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావం, సామాజిక బాధ్యతతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (జిమ్‌సర్‌) లో 2025 సంవత్సరానికి ఎంబిబిఎస్ నూతన విద్యార్థులకు వైట్‌కోట్ ధారణ ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.టి.ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి. రాధిక రెడ్డి మాట్లాడుతూ, వైద్యరంగం వేగంగా మారుతున్నందున విద్యార్థులు పుస్తకాలతో పాటు రోగిని, రోగలక్షణాలను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి అన్నారు. మానవతా విలువలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిరంతర సాధనతో వైద్య వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్‌ డి. రఘునాధరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వైద్యరంగంలో కీలక భూమిక వహించనున్నప్పటికీ, రోగులకు ధైర్యం చెప్పే మానవ సంబంధాలు, వైద్య నైపుణ్యంకి ప్రత్యామ్నాయం లేదన్నారు. గీతం ప్రో వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొ. వై. గౌతమ్‌రావు మాట్లాడుతూ, ప్రతిభ స్కాలర్‌షిప్‌లతో అధిక శాతం మంది విద్యార్థులు ప్రవేశం పొందారని, వైద్య వృత్తిలో విలువలు, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్‌సర్ ప్రో వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి. గీతాంజలి వైద్య విద్యార్థులు తెల్లకోటు ప్రతీకాత్మక ప్రాధాన్యతను అర్థం చేసుకొని వృత్తిలో ఎదగాలని ఆకాంక్షించారు. జిమ్‌సర్ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి. రావు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం స్కిల్ ల్యాబ్ ప్రారంభించామని, గీతం ఆసుపత్రిలో 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 400 మంది వైద్యులు, 500 మంది నర్సులు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఏటా సుమారు 4 లక్షల మంది రోగులు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి గీతం ఆసుపత్రి వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. గీతం పరిధిలోని 15 వేల మంది ప్రజలను వైద్య విద్యార్థులు దత్తత తీసుకొని వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గీతం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ వి.వి.ఎల్. నరసింహరావు విద్యార్థులతో వైద్య వృత్తి పట్ల నిబద్ధత, విలువలతో సేవ చేయాలనే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా నూతన ఎంబిబిఎస్ విద్యార్థులకు తెల్లకోటులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో నూతన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విశాఖపట్నం , అక్టోబర్

వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావం, సామాజిక బాధ్యతతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (జిమ్‌సర్‌) లో 2025 సంవత్సరానికి ఎంబిబిఎస్ నూతన విద్యార్థులకు వైట్‌కోట్ ధారణ ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.టి.ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి. రాధిక రెడ్డి మాట్లాడుతూ, వైద్యరంగం వేగంగా మారుతున్నందున విద్యార్థులు పుస్తకాలతో పాటు రోగిని, రోగలక్షణాలను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి అన్నారు. మానవతా విలువలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిరంతర సాధనతో వైద్య వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు.

ప్రముఖ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్‌ డి. రఘునాధరావు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వైద్యరంగంలో కీలక భూమిక వహించనున్నప్పటికీ, రోగులకు ధైర్యం చెప్పే మానవ సంబంధాలు, వైద్య నైపుణ్యంకి ప్రత్యామ్నాయం లేదన్నారు.

గీతం ప్రో వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొ. వై. గౌతమ్‌రావు మాట్లాడుతూ, ప్రతిభ స్కాలర్‌షిప్‌లతో అధిక శాతం మంది విద్యార్థులు ప్రవేశం పొందారని, వైద్య వృత్తిలో విలువలు, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిమ్‌సర్ ప్రో వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బి. గీతాంజలి వైద్య విద్యార్థులు తెల్లకోటు ప్రతీకాత్మక ప్రాధాన్యతను అర్థం చేసుకొని వృత్తిలో ఎదగాలని ఆకాంక్షించారు.

జిమ్‌సర్ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి. రావు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలోని 22 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం స్కిల్ ల్యాబ్ ప్రారంభించామని, గీతం ఆసుపత్రిలో 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 400 మంది వైద్యులు, 500 మంది నర్సులు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఏటా సుమారు 4 లక్షల మంది రోగులు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుండి గీతం ఆసుపత్రి వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు.

గీతం పరిధిలోని 15 వేల మంది ప్రజలను వైద్య విద్యార్థులు దత్తత తీసుకొని వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

గీతం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ వి.వి.ఎల్. నరసింహరావు విద్యార్థులతో వైద్య వృత్తి పట్ల నిబద్ధత, విలువలతో సేవ చేయాలనే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా నూతన ఎంబిబిఎస్ విద్యార్థులకు తెల్లకోటులు అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో నూతన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.