విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి )
విశాఖ జిల్లా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి.కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.డోలు,సన్నాయి,గంగిరెద్దుల సందడి,భోగి మంటలు,రంగవల్లులతో కార్యాలయం పండుగ శోభను సంతరించుకుంది.చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు,కూచిపూడి,భరతనాట్యం,ధింసా,లంబాడీ నృత్యాలు ఆధ్యంతం అలరించాయి.వేడుకలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి,సంప్రదాయాలు ఎంతో గొప్పవని,మన పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు.రైతన్నకు ఈ సంక్రాంతి సిరులు కురిపించాలని ఆకాంక్షించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో రాష్ట్రం వేగంగా ప్రగతి బాటలో సాగుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,కూటమి శ్రేణులకు,అధికార యంత్రాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు,కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్,బొండా జగన్,రాజాన రామారావు,రౌతు శ్రీనివాస్,లేళ్ళ కోటేశ్వరరావు,కాకి గోవింద్ రెడ్డి,గంధం శ్రీనివాస్,జనసేన నాయకులు గడసాల అప్పారావు,గంధం వెంకటరావు,ఇందల వెంకట రమణ,బీసీ సెల్ అధ్యక్షుడు తమిరె శివప్రసాదరావు,డివి సత్యారావు,వెంకటేశ్వరరావు,కాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:





