
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) డైరెక్టర్‌గా నియమితులైన టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా వివిధ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలసి అభినందనలు తెలియజేస్తున్నారు. గాజువాక హోల్‌సేల్ ఫ్రూట్స్ & వెజిటబుల్స్ మార్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా టిడిపి కార్యాలయానికి వచ్చి ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.
ప్రసాదుల శ్రీనివాసరావు ఒక సాధారణ టీడీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, క్రమంగా కృషి చేస్తూ కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదగడం శుభపరిణామం అని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆయన మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కర్రి నాగేశ్వరరావు, విల్లూరి శ్రీనివాసరావు, మద్దాల రామారావు, ఎ. శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.

