విశాఖ గాజువాక జనవరి
గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హిందూ శక్తి న్యూస్–2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హిందూ శక్తి న్యూస్ ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక అంశాలు విస్తృతంగా వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, బాధ్యతాయుతమైన జర్నలిజంతో సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ శక్తి న్యూస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




