Monday, 23 March 2026
  • Home  
  • గాజువాకలో “నా… కార్యకర్త” పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా
- విశాఖపట్నం

గాజువాకలో “నా… కార్యకర్త” పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా

గాజువాక, నవంబర్ 6 (ప్రత్యేక ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చేపట్టిన “నా… కార్యకర్త” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సమన్వయకర్త, APIIC డైరెక్టర్ శ్రీ ప్రసాదుల శ్రీను పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మురళి మొల్లి పెంటరాజు ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీను మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తల్లోనే ఉంది. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక. ‘నా… కార్యకర్త’ కార్యక్రమం ద్వారా కార్యకర్తలతో నేరుగా మమేకమై వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యమని” తెలిపారు. మొల్లి పెంటరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే. “పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో గాజువాకలో అభివృద్ధి మాత్రమే కాదు, కార్యకర్తల ఉత్సాహం కూడా కొత్త స్థాయికి చేరుకుంది. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకం” అని పేర్కొన్నారు.

గాజువాక, నవంబర్ 6 (ప్రత్యేక ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చేపట్టిన “నా… కార్యకర్త” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సమన్వయకర్త, APIIC డైరెక్టర్ శ్రీ ప్రసాదుల శ్రీను పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మురళి మొల్లి పెంటరాజు ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీను మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తల్లోనే ఉంది. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక. ‘నా… కార్యకర్త’ కార్యక్రమం ద్వారా కార్యకర్తలతో నేరుగా మమేకమై వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యమని” తెలిపారు.
మొల్లి పెంటరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే. “పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో గాజువాకలో అభివృద్ధి మాత్రమే కాదు, కార్యకర్తల ఉత్సాహం కూడా కొత్త స్థాయికి చేరుకుంది. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకం” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.