గాజువాక అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
ఓల్డ్ గాజువాక 80 అడుగుల
రోడ్‌లోని శ్యామల స్వీట్స్ పై అంతస్థులో కనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవానికి కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఏ. పి. రావు, ప్రాంతీయ మేనేజర్ & ఏజీఎం శ్రీ ఎన్. మధుసూదనరెడ్డి ప్రధాన అతిథులుగా హాజరై బ్రాంచ్‌ను ప్రారంభించారు.
ప్రాంత ప్రజలు, వ్యాపారవేత్తలు విస్తృతంగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. సుమారు 120 మంది స్థానికులు పాల్గొన్నారు.
స్థానికంగా కాతా బాలకృష్ణ, పిలా రామకృష్ణ గార్లు స్ట్రాంగ్ రూమ్‌ను ప్రారంభించగా, ఎం. కృష్ణారావు దంపతులు కాష్ కౌంటర్‌ను ఆరంభించారు.
ఆటోనగర్, గాజువాక ప్రాంతాల నుండి వాసివా, ఐలా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
వ్యాపారులు తమ కరెంట్ అకౌంట్లు కనరా బ్యాంక్‌లో ప్రారంభించాలనే ఆసక్తి చూపగా, కొంతమంది రుణాలను కూడా ఈ బ్యాంక్‌కు బదిలీ చేయాలనే ఉత్సాహం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం కొత్త సేవింగ్స్ అకౌంట్లు ప్రారంభమవగా, లోన్ ప్రతిపాదనలు కూడా చర్చించబడ్డాయి.
బ్రాంచ్ మేనేజర్ శ్రీ బి. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ –
> “ప్రజల సహకారంతో ఈ బ్రాంచ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, గృహ, వాహన, వ్యాపార రుణాలు వంటి అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి” అన్నారు.
ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం బ్రాంచ్ హెడ్ శ్రీ బి. విజయ్ కుమార్ (📞 8331019132) ను సంప్రదించవచ్చు.
ప్రాంత వ్యాపారవేత్తలు కనరా బ్యాంక్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, “ప్రజలకు దగ్గరగా ఉండే బ్యాంకింగ్ సేవలతో కనరా బ్యాంక్ పేరు మరింత విశ్వసనీయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.


