గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించిన:-కలెక్టర్ డా సిరి
ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి)
గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్)ను కలెక్టర్ డాక్టర్ సిరి బుధవారం సందర్శించారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం గురించి ఇరిగేషన్ ఎస్సీ బాలచంద్ర, ఈఈ పాండురంగయ్య, ఏఈ అలీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు. ప్రాజెక్ట్ కింద ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు.


