ఖమ్మం జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ ఆశయాలు, అహింస మార్గం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గాంధీజీ బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత సంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కేకేసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి. సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట నాయుడు, నగర కమిటీ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



