*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరగకుండా చూడ వలసిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది పై ఉందని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరీంధిర ప్రసాద్ అధ్యక్షతన మాతృ మరణాల పై డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2025 నెలలో జరిగిన 2 మాతృ మరణాలు, కణితి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఇకపై మాతృ మరణాలు సంభవిస్తే సంబంధిత అధికారుల పై చర్యలు తీసు కొంటామన్నారు. హై రిస్క్ గర్భిణీలు ప్రసవానికి వస్తే కాలయాపన చేయకుండా వెంటనే వైద్య సహాయం అందించాలని, అవసరమైతే KGH కి గాని VGH కి గాని రిఫర్ చేయాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా .జగదీశ్వరరావు మాట్లాడుతూ ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశoలో డా.శంకర్ ప్రసాద్, DCHS, APVVP, డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.సౌమిని, గైనకాలజిస్ట్, HOD, KGH, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, డా.రాదాకృష్ణ, జనరల్ మెడిసిన్, KGH, డా.బి.శ్రీనివాసరావు, అనస్తీసియా, డా.షర్మిల, గైనకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, డా.టివిఎస్ నాయుడు, బ్లడ్ బ్యాంకు, KGH, డా.టి.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, శ్రీమతి ఎం.సత్యవతి, DPHNO, ప్రాధమిక, సామజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.


