*గన్నవరం బిజెపి ఆఫీసులో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు*
గన్నవరం, అక్టోబర్ 31 ( పున్నమి ప్రతినిధి సురేష్)
గన్నవరం బిజెపి ఆఫీసులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చిగురుపాటి కుమార్ స్వామి ఆధ్వర్యంలో, గన్నవరం మండల అధ్యక్షులు నీలం అశోక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధునిక భారత నిర్మాణంలో చేసిన అపూర్వ కృషిని స్మరించారు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఏకీకరణకు అమూల్యమైన సేవలు అందించిన పటేల్ త్యాగం, నాయకత్వం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని గుర్తు చేశారు.
కిసాన్ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాదెండ్ల మోహన్, ఎఎంసి డైరెక్టర్ కానూరు శేషమాధవి, అసెంబ్లీ కన్వీనర్ కురుమద్దాల ఫణికుమార్,ఎస్సీ మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ మేడూరి శేషుబాబు, నీటి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మోతే దుర్గారావు, మండల సెక్రటరీ పస్తం ప్రసాద్, మండల జనరల్ సెక్రటరీ వెంకటకృష్ణ, ఉంగుటూరు మాజీ మండల అధ్యక్షులు రామ్ కోటి, గన్నవరం మాజీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మనిర్భర్ భారత్ మండల కన్వీనర్ పాము సిద్ధూ, అలాగే కొల్లి శ్రీను, అబ్బురి జాన్, అప్పల ఆనంద్, చంటి బాబు, నాగరాజు, చిన్నం రాము, రేమాలి అంజలి, మామిడి అనూష తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


