గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్
యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 10 క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి గన్నవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.13.5 లక్షల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్సును శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వెంకట్రావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడిన యార్లగడ్డ యువతను ఉత్సాహపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడటం తో పాటు గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకు రాబోయే మూడు నెలల కాలంలో 10 గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేస్తామని, మరి కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో వాలీబాల్, షటిల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గన్నవరం ఏర్పాటు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో అమలుపరిచే అవకాశం ఉందన్నారు. నామమాత్రపు ఫీజు తో ఈ క్రికెట్ బాక్సుల్లో క్రికెట్ ఆడుకునేందుకు వీలుంటుందని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, గన్నవరం, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు వరుసగా గూడపాటి తులసి మోహన్, దయ్యాల రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, మేడేపల్లి రామ, బోడపాటి రవి, జాస్తి శ్రీధర్, కొండేటి వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం నియోజకవర్గంలో పది క్రికెట్ బాక్సులు ఏర్పాటు : యార్లగడ్డ
గన్నవరం : పున్నమి ప్రతినిధి సురేష్ యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 10 క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి గన్నవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.13.5 లక్షల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్సును శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వెంకట్రావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడిన యార్లగడ్డ యువతను ఉత్సాహపరిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ స్థలాలను కాపాడటం తో పాటు గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించేందుకు రాబోయే మూడు నెలల కాలంలో 10 గ్రామాల్లో క్రికెట్ బాక్సులు ఏర్పాటు చేస్తామని, మరి కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాల్లో వాలీబాల్, షటిల్, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా గన్నవరం ఏర్పాటు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో అమలుపరిచే అవకాశం ఉందన్నారు. నామమాత్రపు ఫీజు తో ఈ క్రికెట్ బాక్సుల్లో క్రికెట్ ఆడుకునేందుకు వీలుంటుందని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, గన్నవరం, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు వరుసగా గూడపాటి తులసి మోహన్, దయ్యాల రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, టిడిపి నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, మేడేపల్లి రామ, బోడపాటి రవి, జాస్తి శ్రీధర్, కొండేటి వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

