Friday, 3 April 2026
  • Home  
  • గన్నవరంలో KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.25 కోట్ల రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ, KDCC బ్యాంక్ చైర్మెన్ నెట్టెం రఘురాం
- Blog

గన్నవరంలో KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.25 కోట్ల రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ, KDCC బ్యాంక్ చైర్మెన్ నెట్టెం రఘురాం

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ గన్నవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC) ఆధ్వర్యంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు మరియు హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరై KDCC బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరప్పాడు మరియు సత్యనారాయణపురం బ్రాంచ్ ల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఈ ఏడాది కేడీసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయల రుణాలను అందించామని తెలిపారు. వ్యవసాయ రుణ పరపతి పెంచడంలో తమ బ్యాంకు రాష్ట్రంలోనే ముందుందని, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కేడిసిసి చైర్మన్ రఘురాం చేతుల మీదుగా నియోజకవర్గానికి 25 కోట్ల రుణాలు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామాని అన్నారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులో విపరీతమైన విద్వంసం, అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. చల్లపల్లి వంటి పల్లెటూరులో లక్ష రూపాయల సెంట్ విలువ ఉన్న భూమిని ఐదు లక్షలకు కొని స్థానిక నాయకులు, అప్పటి చైర్మన్ కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మహానుభావులు పాలించిన ఈ బ్యాంకులో జగన్ హయాంలో జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదని, దీనిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గానికి సీడీఎఫ్ కూడా కేటాయించాలని కోరారు. అమరావతిని మారుద్దామనుకున్న జగన్ తన హయాంలో అక్కడ ఒక్క ఇటుక కూడా కదపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లుండి శాసనసభలో అమరావతిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగన్ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని, ఆ యాత్రను అమరావతి నుంచే ప్రారంభించాలని, అప్పుడు అక్కడ జరుగుతున్న 59 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చూస్తే ఆయనకే జ్ఞానోదయం అవుతుందని సవాల్ విసిరారు. జగన్ కేవలం మీడియా అట్రాక్షన్ కోసం సినిమాలు చూపిస్తానని మాట్లాడుతున్నారని, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వల్లే వైసీపీకి ప్రతిపక్ష హోదా పోయిందని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్న జగన్, కనీసం పార్లమెంటరీ సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండానే రిటైర్ అయిపోతామని బాధపడుతున్నారని, కనీసం అమరావతి బిల్లు చర్చకైనా జగన్ సభకు రావాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్.ఎస్.పి వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, తెలుగురైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ ఉపాధక్షురాలు కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, పిఏసిఎస్ చైర్ పర్సన్లు ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, ఈడ్పుగంటి కృష్ణమూర్తి, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, అవిర్నేని భవాని శంకర్, కానూరు యుగంధర్, మల్లారెడ్డి కిషోర్, ముద్రబోయిన శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాసరావు, షేక్ చాన్ భాష, వడ్డీ నాగేశ్వరరావు, వడ్డీ అశోక్, దన్నే దుర్గారావు, కాసర్నేని పద్మప్రియ, బేతా సుజాత, ఆళ్ల చిరంజీవి మల్లికార్జునరావు, బోయపాటి మురళీకృష్ణ, జొన్నలగడ్డ దేవరయ్య, అరికట్ల రవికుమార్, చెరుకుమిల్లి వేణు, గొట్టిపూళ్ళ వీరబాబు, కొల్లి వెంకట లక్ష్మీనారాయణ, సబ్బినేని తనూజ, కలతోటి శ్రీనివాసరెడ్డి, వేమూరి రవి, కనకవల్లి శేషగిరిరావు, చింతల వెంకట అప్పారావు మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్

గన్నవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC) ఆధ్వర్యంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు మరియు హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరై KDCC బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరప్పాడు మరియు సత్యనారాయణపురం బ్రాంచ్ ల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఈ ఏడాది కేడీసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయల రుణాలను అందించామని తెలిపారు. వ్యవసాయ రుణ పరపతి పెంచడంలో తమ బ్యాంకు రాష్ట్రంలోనే ముందుందని, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కేడిసిసి చైర్మన్ రఘురాం చేతుల మీదుగా నియోజకవర్గానికి 25 కోట్ల రుణాలు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామాని అన్నారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులో విపరీతమైన విద్వంసం, అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. చల్లపల్లి వంటి పల్లెటూరులో లక్ష రూపాయల సెంట్ విలువ ఉన్న భూమిని ఐదు లక్షలకు కొని స్థానిక నాయకులు, అప్పటి చైర్మన్ కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మహానుభావులు పాలించిన ఈ బ్యాంకులో జగన్ హయాంలో జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదని, దీనిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గానికి సీడీఎఫ్ కూడా కేటాయించాలని కోరారు.

అమరావతిని మారుద్దామనుకున్న జగన్ తన హయాంలో అక్కడ ఒక్క ఇటుక కూడా కదపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లుండి శాసనసభలో అమరావతిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగన్ పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని, ఆ యాత్రను అమరావతి నుంచే ప్రారంభించాలని, అప్పుడు అక్కడ జరుగుతున్న 59 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చూస్తే ఆయనకే జ్ఞానోదయం అవుతుందని సవాల్ విసిరారు. జగన్ కేవలం మీడియా అట్రాక్షన్ కోసం సినిమాలు చూపిస్తానని మాట్లాడుతున్నారని, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వల్లే వైసీపీకి ప్రతిపక్ష హోదా పోయిందని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్న జగన్, కనీసం పార్లమెంటరీ సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండానే రిటైర్ అయిపోతామని బాధపడుతున్నారని, కనీసం అమరావతి బిల్లు చర్చకైనా జగన్ సభకు రావాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్.ఎస్.పి వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, తెలుగురైతు నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ ఉపాధక్షురాలు కంభంపాటి లక్ష్మీ నరసమ్మ, పిఏసిఎస్ చైర్ పర్సన్లు ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, ఈడ్పుగంటి కృష్ణమూర్తి, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, అవిర్నేని భవాని శంకర్, కానూరు యుగంధర్, మల్లారెడ్డి కిషోర్, ముద్రబోయిన శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాసరావు, షేక్ చాన్ భాష, వడ్డీ నాగేశ్వరరావు, వడ్డీ అశోక్, దన్నే దుర్గారావు, కాసర్నేని పద్మప్రియ, బేతా సుజాత, ఆళ్ల చిరంజీవి మల్లికార్జునరావు, బోయపాటి మురళీకృష్ణ, జొన్నలగడ్డ దేవరయ్య, అరికట్ల రవికుమార్, చెరుకుమిల్లి వేణు, గొట్టిపూళ్ళ వీరబాబు, కొల్లి వెంకట లక్ష్మీనారాయణ, సబ్బినేని తనూజ, కలతోటి శ్రీనివాసరెడ్డి, వేమూరి రవి, కనకవల్లి శేషగిరిరావు, చింతల వెంకట అప్పారావు మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.