గద్వాల్ విద్యార్థులకు అస్వస్థత…. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.
గద్వాల్ నవంబర్ 01(పున్నమి ప్రతినిధి)
గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మారం బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ కారణంగా 54మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన పైన జిల్లా కలెక్టర్ బి ఏం సంతోష్ తీవ్రంగా స్పందించారు.
హాస్టల్ వార్డెన్ జయరాములును తక్షణమే సస్పెండ్ చేయాలనీ అధికారులను అదేశించారు.
అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది


