పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్
తిరుపతి గ్రామీణ మండలం దుర్గసముద్రం పంచాయతీ వద్ద గల డంపింగ్ యార్డును పురపాలక శాఖ మంత్రి నారాయణ ,ఇతర అధికారులతో కలిసి
పరిశీలించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వ తప్పిదాల వల్లే రాష్ట్రంలోని మునిసిపాలిటీలలో చెత్త పేరుకుపోయింది.
మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇతర దేశాలలో పర్యటించినప్పుడు చెత్త నుండి సంపద సృష్టి ఎలా అన్నదానిపై అధ్యయనం చేశారు. మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 100 డంపింగ్ యార్డ్ లలో చెత్త నుండి సంపదను సృష్టించే విధంగా ఏర్పాట్లను చేశారు.
అంతేకాకుండా సాలీడు వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాట్లకు కృషి చేస్తున్నారు.
అందుకోసం దుర్గ సముద్రం వద్ద గల డంపింగ్ యార్డ్ ఆనుకునే సుమారు పది ఎకరాలు స్థల పరిశీలన చేస్తామన్నారు.
ఇందులో కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి.
చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమీకరించిన చెత్త నుండి విద్యుత్తుతోపాటుగా బ్రిక్స్ తయారీకి ఉపయోగించుకోవచ్చు.
రాబోయే రోజులలో చెత్త రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు
మరి కొన్ని సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జేసీ గోవింద రావ్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య , కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.




