విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
06 సంవత్సరాలు నుండి ముద్దాయి తప్పించుకు తిరుగుతున్నా గంజాయి రవాణా కేసు ముద్దాయి పట్టివేత
గంజాయి రవాణా కేసుకు సంబందించి తేదీ 13.02.2020 న 12:30 నిమిషాలకు పిర్యాది దారుడు అయిన తెర్లి తమ్మి నాయుడు, సిఏస్ఓ , కోరమాండల్ కంపెనీ, శ్రీహరిపురం, మల్కాపురం, విశాఖపట్నం సిటీ వారు ఇచ్చిన కంప్లైంట్ ఏమనగా ముద్దాయి అయినా బిజే కబాసి,వయసు 37 తండ్రి సానియా కబాసి , ఆదివాసీ కులం, కరస్తాగూడ గ్రామం, కంవాడ, మల్కాన్గిరి జిల్లా, ఒడిషా రాస్ట్రం.
బిజే కబాసి అతని యొక్క లారీ నెంబర్ AP16 TJ 4627 లో 50.200 Kg ల గంజాయిని అక్రమంగా తరలించే క్రమంలో కోరమండల్ కంపెనీలో సదరు లారీ ని లోడింగ్ నిమిత్తం కోరమాండల్ 4 వ గెట్ వద్ద పెట్టగా సెక్యూరిటీ వారికి గంజాయి తో పాటు పట్టుబడినట్లు ముద్దాయి వెంటనే తప్పించుకుని పారిపోయినట్లు దానిపై తెర్లి తమ్మి నాయుడు, మల్కాపురం పోలీసు వారు పైన తెలిపిన కేసు ని 1 3 వ ఫిబ్రవరి 2020 వ సంవత్సరం లో నమోదు చేసినట్లు, దర్యాప్తులో భాగంగా పోలీసు వారు సదరు ముద్దాయిని తన స్వగ్రామం అయిన కరస్తాగూడ గ్రామం మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో నాలుగు సార్లు పట్టుకునే ప్రయత్నం కు వెళ్ళగా అక్కడ గ్రామస్తులు పోలీస్ వారికి సహకరించకపోగా తిరిగి పోలీస్ వారిపై తిరగబడడం చేయడం వలన ఇప్పటి వరకు ముద్దాయి పోలీస్ లకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పిమ్మట విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకాబ్రతా బగ్చి ఆదేశాల మేరకు ఒరిస్సా పోలీస్ ల సహకారం తీసుకుని, మల్కాపురం సి ఐ గొలగాని అప్పారావు వారి సిబ్బందితో గత వారం రోజులుగా మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రంలో మాటువేయించి ముద్దాయి యొక్క సమాచారాన్ని సేకరించి కీలక సమాచారం రాబట్టి దానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయి మాచర్ల, పల్నాడు జిల్లాలో లారీ డ్రైవరు గా పనిచేస్తున్నట్లు తెలుసుకోగలిగారు


