Thursday, 31 July 2025
  • Home  
  • గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు వికరిస్తున్న లేదా సేవిస్తున్న వారు వివరములు పోలీసు వారు తెలియజేయాలి
- తూర్పు గోదావరి

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు వికరిస్తున్న లేదా సేవిస్తున్న వారు వివరములు పోలీసు వారు తెలియజేయాలి

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి. రాజమహేంద్రవరం: జిల్లా. జూలై 30:తెలుగు వార్త ప్రతినిధి జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ మరియు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ యాంటిబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో రెండు‌ డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి,ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు, ఈగల్ టీం,ది‌రాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటిబయాటిక్స్ నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ మరియు సదస్సు నిర్వహించారు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో ర్యాలీని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ఝ్ర ప్రభుత్వ‌పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్సు డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయమన్నారు. యాంటిబ‌యోటిక్స్ మ‌రియు నార్కోటిక్స్ డ్ర‌గ్స్ వినియోగంపై ప్ర‌జల‌లో అవ‌గాహ‌న క‌ల్గించ‌డానికి ఈ కార్యక్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటి బ‌యోటిక్స్ వాడ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాలు దెబ్బ‌తింటున్నాయ‌ని, అందువ‌ల్ల ప్ర‌జ‌లు ముందుగా డ్రగ్స్ వినియోగంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల కళాశాలలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నామని చెప్పారు. మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పోలీసులకు తెలియచేయాలని కోరారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న అటువంటి వారిపై పి.డి.యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ… ప్రభుత్వం సూచనల మేరకు మాత్రమే మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్ ఎన్. బి. ఎం. మురళీకృష్ణ డి.ఎస్.పి సెంట్రల్ జోన్) రమేష్ బాబు ఇన్స్పెక్టర్ డి సి ఆర్ బి పవన్ కుమార్ రెడ్డి , ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ అప్పారావు ఇన్స్పెక్టర్( సి సి ఎస్) శ్రీధర్ కుమార్ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి పి.నాగమణి గారు నగరంలోని మెడికల్ షాపు యాజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు, తూర్పుగోదావరిజిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీ మరియు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్ల కార్డులను వారంతా ప్రదర్శించారు.

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి.

రాజమహేంద్రవరం: జిల్లా.
జూలై 30:తెలుగు వార్త ప్రతినిధి
జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ మరియు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,
ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
యాంటిబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
జిల్లాలో రెండు‌ డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి,ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,
రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు, ఈగల్ టీం,ది‌రాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో యాంటిబయాటిక్స్ నార్కోటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ మరియు సదస్సు నిర్వహించారు. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ లో ర్యాలీని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., జెండా ఊపి ప్రారంభించారు.
సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ఝ్ర ప్రభుత్వ‌పిలుపునకు స్పందించి రాజమండ్రిలోని కెమిస్ట్సు డ్రగ్గిస్ట్సు అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయమన్నారు.
యాంటిబ‌యోటిక్స్ మ‌రియు నార్కోటిక్స్ డ్ర‌గ్స్ వినియోగంపై ప్ర‌జల‌లో అవ‌గాహ‌న క‌ల్గించ‌డానికి ఈ కార్యక్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటి బ‌యోటిక్స్ వాడ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాలు దెబ్బ‌తింటున్నాయ‌ని, అందువ‌ల్ల ప్ర‌జ‌లు ముందుగా డ్రగ్స్ వినియోగంపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు.
యాంటిబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించేందుకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల కళాశాలలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నామని చెప్పారు.
మెడికల్ షాపుల్లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పోలీసులకు తెలియచేయాలని కోరారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న అటువంటి వారిపై పి.డి.యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.
డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ… ప్రభుత్వం సూచనల మేరకు మాత్రమే మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల చీటీ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించకుండా చూస్తామని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్ ఎన్. బి. ఎం. మురళీకృష్ణ డి.ఎస్.పి సెంట్రల్ జోన్) రమేష్ బాబు ఇన్స్పెక్టర్
డి సి ఆర్ బి పవన్ కుమార్ రెడ్డి , ఇన్స్పెక్టర్
త్రీ టౌన్ అప్పారావు ఇన్స్పెక్టర్( సి సి ఎస్) శ్రీధర్ కుమార్ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి పి.నాగమణి గారు నగరంలోని మెడికల్ షాపు యాజమానులు, సిబ్బంది, ది రాజమండ్రి హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు, తూర్పుగోదావరిజిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీ మరియు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మందుల వినియోగంపై అవగాహన కల్పించే ప్ల కార్డులను వారంతా ప్రదర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.