దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న సుమారు 4.5 లక్షల విచారణ ఖైదీలకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 62(5) రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో వాదించారు. నేరం రుజువుకాని ఖైదీలకు ఓటు హక్కు లేకపోవడం అన్యాయం అని పిటిషనర్లు తెలిపారు. దీనిపై స్పందన ఇవ్వాలని కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జైళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయవచ్చని సూచించారు.

ఖైదీల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు విచారణ – కేంద్రానికి, ఈసీకి నోటీసులు