నిర్మల్ జిల్లా, ఖానాపూర్ అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని, సమాచార హక్కు చట్ట (ఆర్‌టీఐ) పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఖానాపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ స్వామీదాస్ గారికి మరియు పీఐఓ కపిల్ గారికి (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) సమాచార హక్కు చట్టాల పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించడం, దాని అమలును పర్యవేక్షించడం తమ కమిటీ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహా చట్ట హక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


